హైదరాబాద్ నగరంలో మరోసారి లాక్‌డౌన్..?
హైదరాబాద్ నగరంలో మరోసారి లాక్‌డౌన్..?
లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పుడు తెలంగాణలో కరోనా నియంత్రణలో ఉండగా.. ఆంక్షలు సడలించిన తర్వాత రాష్ట్రంలో కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లో నిత్యం 800 లకు తక్కువ కాకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే హైదరాబాద్ నగరంలో పరిస్థితి చేయి దాటిపోతుందనే భావన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడి కోసం హైదరాబాద్ నగరంలో జులై 1st నుంచి రెండువారాలపాటు మరోసారి లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఈ అంశంపై మంత్రి తలసాని మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో మళ్లీ లాక్ డౌన్ విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా చెప్పారు. నగర పరిధిలో పూర్తి లాక్ డౌన్ మళ్లీ విధించాలా లేదా అన్న అంశంపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని వివరించారు. మరో రెండు లేదా మూడు రోజుల్లోపు సీఎం కేసీఆర్ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. శుక్రవారం తలసాని ఓ న్యూస్ ఛానెల్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు.
Lockdown again in Hyderabad
కరోనా కేసులు మన దగ్గర కంటే ముంబై, ఢిల్లీ, చెన్నై నగరాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. కాగా మరోసారి పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధించడానికి మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు ప్రభుత్వాలు సుముఖంగా లేవు. ఒక వేళ పరిస్థితి మరీ దిగజారితే.. కేంద్రం ఆదేశిస్తేనే ఈ హాట్‌స్పాట్‌లలో లాక్‌డౌన్ విధించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కఠినంగా లాక్‌డౌన్ విధించడానికి ఇష్టపడటం లేదు.
హైదరాబాద్‌లో లాక్‌డౌన్ అమలు చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్న తరుణంలో.. చాలా మంది నెటిజన్లు లాక్‌డౌన్ గురించి ఆరా తీస్తున్నారు. కొందరు లాక్‌డౌన్ పొడిగిస్తారా అని ప్రశ్నించగా.. మరికొందరు మాత్రం వెంటనే లాక్‌డౌన్ విధించి.. ఎక్కువ సంఖ్యలో కరోనా టెస్టులు చేయాలని సూచిస్తున్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin