హైదరాబాద్‌లో 11 ఉచిత కరోనా కేంద్రాలు
హైదరాబాద్‌లో 11 ఉచిత కరోనా కేంద్రాలు
కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలు తొలిసారి స్వచ్ఛందంగా కరోనా కేంద్రానికి వెళ్లి ఉచితంగా పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న హైదరాబాద్‌లో 11 ఉచిత పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించిన వివరాలను ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. కరోనా లక్షణాలున్న వారు అక్కడికి వెళ్లి ఉచితంగా పరీక్ష చేయించుకోవచ్చునని ఆయన తెలిపారు. Free corona testing centers
ఉచిత కరోనా పరీక్ష కేంద్రాలివే:
1. కోఠిలోని కింగ్ కోఠి హాస్పిటల్
2.నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రి
3.ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్
4.అమీర్ పేటలోని నేచుర్ క్యూర్ ఆసుపత్రి
5.మెహదీపట్నంలోని సరోజిని దేవి ఐ హాస్పిటల్
6.ఎర్రగడ్డలోని ఆయుర్వేదిక్ హాస్పిటల్
7.రామంతపూర్‌లోని హోమియోపతి హాస్పిటల్
8.చార్మినార్‌లోని నిజామియా టిబ్బి హాస్పిటల్
9.కొండాపూర్‌లోని ఏరియా ఆసుపత్రి
10.వనస్థలి పురంలోని ఏరియా ఆసుపత్రి
11.నాచారంలోని ఈఎస్ఐ హాస్పిటల్
కాగా తెలంగాణలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 17,357కు చేరింది. వీరిలో 8,082 మంది కరోనాను జయించగా.. 267 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 9,008 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Free corona testing centers
హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అత్యవసర సమయం లో మాత్రమే బయటికి రావాలని అదేవిదంగా మాస్క్ పెట్టుకొని భౌతిక దూరం పాటించాలని నిత్యావసర వస్తువులు నెలకు సరిపడా ఒకే సరి కొనుగోలు చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు, వైరస్ తీవ్రత తగ్గే వరకు షాప్పింగులూ , వేడుకలు , పార్టీలు , మానుకోవాలని తెలిపారు.
హైదరాబాద్ లో కొన్ని ఏరియాలలో వ్యాపారాలు స్వచ్చందంగా బందు పాటిస్తున్నారు. సికింద్రాబాద్ , ప్యాట్నీ సెంటర్ , పారడైజ్ సెంటర్ లో స్వచ్చంద బ్యాండ్ పాటిస్తున్నారు. ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటలవరకు బందును పాటిస్తున్నారు ప్రైవేట్ ఆఫీస్ లు కూడా ఈ బందులో పలు పంచుకున్నాయి. ఈ సమయం లో నే రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లొక్డౌన్ పెట్టె సూచనలు ఉన్నాయ్ అని దీని ద్వారా మరి కొన్ని రోజులు వైరస్ ని అరికట్ట వచ్చు అని తెలియ చేసారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin