మరో 2 నెలల్లో కరోనా టీకా అందుబాటులోకి !
మరో 2 నెలల్లో కరోనా టీకా అందుబాటులోకి !
ప్రాణాంతక కరోనా వైరస్ నివారణకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన టీకా అభివృద్ధి కార్యక్రమం కీలకమైన ముందడుగు వేసింది. చింపాంజీలపై జరిపిన ప్రయోగాలు ప్రోత్సాహకరమైన ఫలితాలివ్వగా మానవ ప్రయోగాలు వేగంగా నిర్వహిస్తున్నట్లు ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త, జెనెన్‌ర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ఆడ్రియన్ హిల్ ప్రకటించారు. టీకా అక్టోబర్‌కల్లా సిద్ధమయ్యే అవకాశముందన్నారు. ఫార్మా కంపెనీ ఆస్ట్రా జెనెకాతో కలిసి ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ కొత్త టీకాను ఇప్పటికే బ్రెజిల్‌లోని కొంతమంది కార్యకర్తలపై ప్రయోగించారు. టీకా అభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 సంస్థలు/ పరిశోధన కేంద్రాలు టీకాలు అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉండగా, వీటన్నింటి లోనూ ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ టీకా మేలైన ఫలితాలు ఇస్తు న్నట్లు తెలుస్తోంది.
corona virus vaccine updates
ఈ కార ణంగానే ఈ టీకా ఇప్పటికే మానవ ప్రయోగాల తుదిదశ కు చేరుకుందని అంచనా. దక్షిణాఫ్రికాలోనూ ఈ టీకాను సుమారు 200 మందిపై ప్రయోగిస్తున్నారు. బ్రిటన్‌లో సుమారు 4000 మంది ఇప్పటికే టీకా ప్రయోగాలకు తమ సమ్మతిని తెలిపారని, మరో పదివేల మందిని సమీప భవిష్యత్తులో నియమించుకుంటామని కంపెనీ చెబుతోంది. ఏప్రిల్ 23న ఈ మానవ ప్రయోగాలు మొదలయ్యాయని సమాచారం. వీటి వివరాలు ఆగస్టు లేదా సెప్టెంబరు నెలకు అందుతాయని, తదనుగుణంగా అక్టోబరులో టీకాను విడుదల చేస్తామని అడ్రియన్ హిల్ ఇటీవల జరిగిన ఒక వెబినార్‌లో వ్యాఖ్యానించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఆస్ట్రా జెనెకా 3కోట్ల టీకా డోసులను సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ టీకాను స్థానికంగా తయారు చేసేందుకు ఆస్ట్రా జెనెకాతో ఒక ఒప్పందం చేసుకుంటున్నట్లు బ్రెజిల్ ఆరోగ్య శాఖ మంత్రి ఎడ్యురాడో పాజిల్లో తెలిపారు.
corona virus vaccine updates
కరోనా వైరస్ వాక్సిన్ అందుబాటులోకి తేవడానికి ప్రపంచం మొత్తం పోటీపడుతోంది ఈ నేపధ్యం లో వచ్చే అక్టోబర్ లో వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin