సలేశ్వరం లింగమయ్య జాతర రద్దు.
సలేశ్వరం లింగమయ్య జాతర రద్దు కారణంగా బుధవారం రాత్రి ఇద్దరు అర్చకులతో ప్రత్యేక పూజలు నిర్వహించాం
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం సలేశ్వరం లింగమయ్య జాతరను కరోనా వైరస్ ప్రభావం వల్ల రద్దు చేసినందుకు, బుధవారం చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు రాత్రి లింగమయ్య కు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశాలతో ఇద్దరు స్థానిక ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. పిఓ ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని,కారోనా మహమ్మారి ప్రపంచాన్ని భయభ్రాంతుల నుండి విముక్తి కల్పించాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు, ఐటీడీఏ పీవో అఖిలేష్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. achampet
Saleswaram lingamayya jatara
శ్రీశైలానికి 40 కిలొమిటర్ల దూరంలో వుంటుంది సలేశ్వరం. అడవిలో నుండి 25 కిలొమిటర్ల ప్రయాణం వుంటుంది. ఇందులో 20 కిలోమీటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది అక్కడి నుండి 5 కిలోమీటర్ల కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో వున్న గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్ధులు అవుతారు.
Saleswaram lingamayya jatara
సలేశ్వరం శ్రీశైలం దగ్గరలోని ఒక యత్రా స్థలము. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యాత్రా స్థలము. ఇక్కడ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తొలి పౌర్ణమికి మొదలగుతుంది. కేవలం ఐదు రోజులు మాత్రమే ఈ గుడి తెరిచివుంటుంది.. ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి.
ఇది నాగర్కర్నూల్ జిల్లాలో నల్లమల అడవులలో వుంది. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే రహదారిలొ 150 కిలోమీటర్ రాయి నుండి 32 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో వుంది. ప్రకృతిరమణీయతతో అలరారుతున్న దట్టమైన గుడి, ఎత్తైన కొండలు పాలనురుగులా జాలువారే జలపాతం,ప్రకృతి అందాలతో పాటు ఎంతో చారిత్రాత్య్మక నేపథ్యం కలిగిన సలేశ్వర క్షేత్రం. ఈ క్షేత్రవిశేషాలేంటో ఇప్పుడు చూద్దాం
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin