• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

సర్దుబాటు డిప్యుటేషన్లను రద్దు చేయాలి

Share Button

రాజకీయ నాయకుల పలుకుబడి ఉపయోగించి, అధికారులపై ఒత్తిడి తెచ్చి, ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై పంపించడం జరుగుతుంది.అట్టి డిప్యుటేషన్ లను రద్దు చేయాలని DTF డిమాండ్ చేస్తుంది. మండలంలోని UPS కొరటికల్ పాఠశాల యందు 7 తరగతులు నిర్వహిస్తున్నారు.

1 నుండి 7 తరగతులలో విద్యార్థులకు నష్టం చేస్తూ ఉన్నారు అయినా విద్యార్థులు తక్కువగా ఉన్నారని చెప్పి స్థానిక ఎంఈఓ అంతకు ముందే ఈ పాఠశాల నుండి ఇద్దరు ఉపాధ్యాయులను మండలంలోని వేరే పాఠశాలకు సర్దుబాటు చేశారు. తర్వాత ఈ నెల చివరన ఒక ఉపాధ్యాయుడు రిటైర్ అవుతున్నాడు. మిగిలిన ముగ్గురు ఉపాధ్యాయులలో ఇప్పుడు యుపిఎస్ కొరటికల్ ఉప్పునుంతల మండలం నుండి ఏకంగా బిజినపల్లి మండలం శాయినిపల్లి పాఠశాలకు ఒక ఉపాధ్యాయురాల్ని విద్యాశాఖకు ఉత్తర్వులకు వ్యతిరేకంగా డిప్యూటేషన్ మీద పంపించడం జరిగింది.

ఇక ఆ పాఠశాలలో మిగిలింది ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నారు. 1 నుండి 7 తరగతులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఎలా బోధన చేయాలని సతమతమవుతున్నారు.

RTE 2009 చట్టం ప్రకారం డిప్యూటేషన్ రద్దు చేయబడినది.సర్దుబాటు పేరుతో ఒక పాఠశాల విద్యార్థులకు అన్యాయం చేస్తూ మరొక పాఠశాలకు ఉపాధ్యాయులను పంపించడం సరియైనది కాదని DTF అడుగుతుంది.సర్దుబాటు కూడా విద్యాశాఖ ఆ మండల పరిధిలోనే సర్దుబాటు చేయాలని చెప్పినా,అధికారులు,రాజకీయాల వాళ్ల వత్తిడికి తలొగ్గి విద్యా శాఖ ఇచ్చిన ఉత్తర్వులను తుంగలో తొక్కి ఉపాధ్యాయులను మండల పరిధి దాటి సర్దుబాటు చేయడాన్ని DTF ఖండిస్తుంది.

అట్టి సర్దుబాటును వెంటనే రద్దు చేసి UPS కొరటికల్ పాఠశాల విద్యార్ధులకు న్యాయం చేయాలని DTF డిమాండ్ చేస్తుంది. సర్దుబాటు ప్రక్రియ మండల పరిధిలోనే జరగాలని,మండల పరిధి దాటి సర్దుబాటు చేయకూడదని కోరుతుంది.ఇట్టి విషయంను స్థానిక ఎంఈఓ గారి దృష్టికి ఆ గ్రామ సర్పంచ్ గారు తీసుకెళ్లిన అది జిల్లా నుండి నాకు ఉత్తర్వులు అందినవి, పై అధికారుల ఆదేశాలనుసారం నేను పాటించాల్సి వస్తుందని తెలిపినాడు కావున తల్లిదండ్రులు, గ్రామ సర్పంచ్ గారు మా పాఠశాలకు ఉపాధ్యాయులను పంపి మా విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

అదే విషయాన్ని మేము అధికారుల దృష్టికి తెస్తున్నాం.కావున ప్రభుత్వ పాఠశాలలో న్యాయమైన విద్యను ఆశిస్తూ ఇలా సర్దుబాటు చేయడాన్ని తీవ్రంగా ఖండింస్తున్నామని నాగర్ కర్నూల్ జిల్లా DTF అధ్యక్షులు బి.గోవర్ధన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జె.రామస్వామి తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat