గాల్వన్ ఘర్షణ.. 20 మంది భారత జవాన్లు మృతి..!

0
galwan vally india china border

galwan vally india china border

గాల్వన్ ఘర్షణ.. 20 మంది భారత జవాన్లు మృతి..!

గాల్వన్ లోయలో భారత్- చైనా బలగాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో సుమారు 20 మంది భారత సైనికులు మృతి చెందినట్లు జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐ ఈ మేరకు వివరాలను వెల్లడించింది. ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అటు చైనా వైపు సుమారు 43 మంది గాయపడటం లేదా మరణించడం జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం అందించాయి. గాల్వన్ లోయ ఘటనలో గాయపడిన, మృతి చెందిన సైనికులను తీసుకెళ్లేందుకు గగనతలంలో LAC అంతటా చైనీస్ చాపర్లు చక్కర్లు కొట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. galwan vally india-china border

galwan vally india china border
galwan vally india china border

గాల్వాన్ వ్యాలీలోని పాంగాంగ్ సో, డెమ్ చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతాల్లోనూ కొన్ని వారాలుగా భారత్..చైనా సైనికుల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. పాంగాంగ్ సోతో బాటు పలు డీ-ఫ్యాక్టో బోర్డర్స్ లో.. ముఖ్యంగా వాస్తవాధీన రేఖ వద్ద చైనా దళాలు ముందుకు చొచ్ఛుకు వచ్చాయి. చర్చలు జరిగినప్పటికీ పాంగాంగ్ సరస్సు వద్ద గస్తీ తిరుగుతున్న రెండు దేశాల సైనికులూ ఒక దశలో పిడిగుద్దులు కురిపించుకున్నారు.

galwan vally india-china border

అయితే ఈ నెల 6న ఉభయ దేశాల సైనికాధికారుల మధ్య మళ్ళీ చర్చలు జరిగిన దరిమిలా.. గాల్వన్ ప్రాంతంలో చైనా సైన్యం కొంత వెనక్కి తగ్గగా.. భారత ఆర్మీ కూడా తన సైనిక వాహనాలతో బాటు తిరిగి వెనక్కి మళ్లింది.

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *