కరోనా ఉధృతి..ఆయా రాష్ట్రాల్లో మరోసారి కఠిన లాక్‌డౌన్ !
భారత్ 2,97,535 కరోనా కేసులతో నాలుగో స్థానంలో ఉంది. అయితే, దేశంలో క్రమంగా లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో మరోసారి మహమ్మారి ఉద్ధృతమవుతోంది. దీంతో కొన్ని రాష్ట్రాలు మరోసారి ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి. మరికొన్ని పూర్తిగా షట్‌డౌన్‌కు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.
భారత్ లో కరోనా అనూహ్య రీతిలో వ్యాప్తి చెందుతోంది. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానానికి చేరింది. అమెరికా 20లక్షలకు మించి కరోనా కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, రెండో స్థానంలో బ్రెజిల్ ఉంది. ఆ దేశంలో ఏడులక్షల 72వేల కరోనా కేసులు నమోదయ్యాయి. మూడో స్థానంలో రష్యా నిలిచింది. ఆ దేశంలో 5లక్షలకు చేరువలో కరోనా కేసులు ఉన్నాయి. భారత్ 2,97,535 కరోనా కేసులతో నాలుగో స్థానంలో ఉంది. అయితే, దేశంలో క్రమంగా లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో మరోసారి మహమ్మారి ఉద్ధృతమవుతోంది. దీంతో కొన్ని రాష్ట్రాలు మరోసారి ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి. మరికొన్ని పూర్తిగా షట్‌డౌన్‌కు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.Telangana lockdown again
దేశంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు పంజాబ్, కేరళ, తమిళనాడు,ఝార్ఖండ్ లలో మరోమారు సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలనే యోచనలో ఆయా రాష్ట్రప్రభుత్వాలు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పంజాబ్‌లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువకావడంతో వారాంతాలు, పబ్లిక్ హాలీడేస్‌లో లాక్‌డౌన్ కఠినంగా అమలుచేయాలని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ గురువారం ఆదేశించారు. కేవలం ఈ-పాస్‌లు ఉన్నవారికి మాత్రమే అనుమతించాలని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది, నిత్యావసరాల సేవల సిబ్బంది మినహా ప్రజలు ఈ-పాస్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇక, పారిశ్రామిక రంగంలో మాత్రం సాధారణ కార్యకలాపాలకు అనుమతులు కొనసాగుతాయని తెలిపారు.
మరోవైపు, తమిళనాడులోని చెన్నైలో కరోనా మరింతగా విజృంభిస్తున్నది. వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరోసారి పూర్తి లాకడౌన్‌ను ఎందుకు అమలు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. న్యాయమూర్తులు వినీత్ కొఠారి, ఆర్ సురేశ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం విచారణ జరిపింది. రాష్ట్రంతోపాటు చెన్నైలో కరోనా పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు మరోసారి పూర్తిగా లాకడౌన్ విధింపు లేదా కర్ఫ్యూను అమలు చేసే వంటివి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయా అని ప్రభుత్వ తరుఫు న్యాయవాదిని ప్రశ్నించింది. శుక్రవారంలోగా దీనిపై స్పందన తెలియజేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది.
Telangana lockdown again
ఇక, ఝార్ఖండ్‌లోనూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలుచేయాలని ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌ను మిత్రపక్షం కాంగ్రెస్ కోరింది. అటు, కేరళ సైతం కఠినమైన ప్రమాణాలతో కంటెయిన్‌మెంట్ జోన్లను నిర్వచించే పద్దతిని రూపొందించాలని నిర్ణయించింది. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లోనే 10 వేల 956 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కాగా, తొలిసారి కేసుల సంఖ్య 10వేలను దాటడం ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దేశంలో మరోమారు కఠిన లాక్‌డౌన్ అమలు చేయాలనే మెజార్జీ ప్రజలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin