వ్యవసాయ శాఖ అధ్వర్యంలో పంటలపై అవగాహన సదస్సు
లింగాల మండలం దత్తారం గ్రామంలో వ్యవసాయ శాఖ అధ్వర్యంలో పంటలపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రతి వ్యవసాయదారుడు రైతుభీమాకు దరఖాస్తు చేయించుకోవాలని,దరఖాస్తు చేసుకున్న రైతులు ఏమైనా తప్పులు ఉంటే స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి మార్పులు,చేర్పులు చేసుకోవాలని సూచించారు.
వేరుశెనగ పంట వేసిన 25-45 రోజులకు జిప్సం వేసుకోవాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జి.జంగమ్మ,ఏఈవో నరేష్ రాథోడ్,గ్రామ రైతులు పాల్గొన్నారు.