కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణి చేసిన ఎమ్మెల్యే గువ్వల
అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు గురువారం ఉదయం కళ్యాణలక్ష్మీ చెక్కులను వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేదింటి ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మీ పథకం ఒక వరమని,ప్రభుత్వం సంక్షేమ పథకాలను అన్ని వర్గాల వారికీ అందిస్తుందని తెలిపారు.అంతేకాకుండా ప్రభుత్వం అన్నీ వర్గాల వారికీ అందుబాటులో వుండే విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుండి తెరాస నేతలు, ప్రజలు తరలివచ్చారు.