• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

గురుకులాల్లో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు

Share Button

రాష్ట్రంలోని 34 గురుకుల పాఠశాలలో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులను ప్రారంభించినట్లు గురుకుల రాష్ట్ర కార్యదర్శి డా.ప్రవీణ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాలలో రూ 1.50 కోట్లతో నిర్మించిన అదనపు గదులు, కస్తూర్భా బాలికల విద్యాలయంలో నూతనంగా నిర్మించిన జూనియర్ కళాశాల భవనాన్ని గురుకులాల కార్యదర్శి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం గురుకుల పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చదువులో రాణించాలని కోరారు.రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులతోపాటు 53 మహిళా డిగ్రీ కళాశాలను ప్రారంభించినట్లు తెలిపారు. రాబోయే కాలంలో గురుకులాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుటకు తగు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తల్లిదండ్రులు ఆడ పిల్లల చదువు విషయంలో సమస్యగా మారకుండా స్వేచ్ఛగా చదువుకునే వాతావరణం కల్పించాలని కోరారు.

అనంతరం గువ్వల బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో గురుకులాల రూపురేఖలే మారాయన్నారు. ప్రభుత్వం బడుగు, బలహీన విద్యార్థుల సంక్షేమం కోరుతూ అన్ని వర్గాల వారికి గురుకుల విద్యను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు.సమస్యలను అధిగమించి ఆత్మగౌరవంతో చదువుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను హక్కుగా భావించి సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు.
ఈ కార్యక్రమంలో డీఈవో గోవిందరాజులు, ప్రిన్సిపాల్స్ నాగభూషణం, శారద, ఎంఈఓ చంద్రుడు, జడ్పిటిసి నేజమ్మ, ఎంపీపీ లింగమ్మ, సర్పంచ్ కోనేటి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat