ఉచిత కుట్టు మిషన్ శిబిరం ప్రారంభం
స్వయం ఉపాధితో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని వండర్ ఉమెన్ సొసైటీ చైర్మన్ కల్పన అన్నారు.లింగాలలో ఉచిత కుట్టు మిషన్ ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ…మహిళలు కుట్టు మిషన్ శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.మహిళలు ఆర్థికంగా రాణించాలనే సంకల్పంతో తమ సంస్థ పనిచేస్తుందన్నారు.
లింగాల మండలంలో అప్పాయిపల్లి,అంబటిపల్లి,రాయవరం,ధారారం,క్యాంపు రాయవరం ఒక్కొక సెంటర్,లింగాలలో 4 సెంటర్లు ద్వారా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు.
50 మంది మహిళలతో సెంటర్ ఏర్పాటుకు ఎవరైనా ముందుకు వస్తే ఒక శిక్షకురాలిని నియమించి ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఉచిత కుట్టు మిషన్ శిబిరాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 3నెలల పాటు కొనసాగే ఈ శిబిరంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్ తో పాటు సబ్సిడీ పై కుట్టు మిషన్ ఇవ్వడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆర్ఢీనెటర్ యతి రాజు,మండల కో-ఆర్ఢీనెటర్ గోవిందమ్మ,రాఘవేంద్ర పాల్గొన్నారు.