సర్వేకు మాత్రమే సంతకం
యురేనియం తవ్వకాలకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంతకం చేయలేదని కేవలం సర్వే కి మాత్రమే అనుమతులు సంతకం చేశారని దీన్ని ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు.
ఆయన విలేకరులు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ…ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పోరాడుతున్నారని, తాము కూడా యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామని తెలిపారు.
ప్రజలు వాస్తవాన్ని గుర్తించాలని ఆయన కోరారు.