సంచలన నిర్ణయం…ఆర్టికల్ 370 రద్దు
భారత రాజకీయ చరిత్రలో సంచలన నిర్ణయం. 70 ఏళ్లుగా ఏ ప్రభుత్వం చేయని సాహసాన్ని.మోదీ ప్రభుత్వం చేసింది.370 ఆర్టికల్ రద్దు ద్వారా జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇదే సమయంలో జమ్ము కాశ్మీర్ ను మూడు ప్రాంతాలు విభజించారు. జమ్ము- కాశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేస్తూ…అదే సమయంలో లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు.
ఆర్టికల్ 370 రద్దుకు భారత హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రతిపాదించిన క్షణాల్లోనే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌పై ఇక సర్వాధికారాలు కేంద్రానికే ఉండనున్నాయి.
370 ఆర్టికల్ రద్దుతో జమ్మూకాశ్మీర్ ఇక భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో పాటు కొనసాగనుంది. జమ్మూ కాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక రాజ్యాంగం రద్దుతో పాటు ద్వంద పౌరసత్వం రద్దు కానుంది.
భారతదేశ రాజ్యాంగం కాశ్మీర్ లోనూ అమలు కానుంది.ఇక కేంద్ర ప్రభుత్వం చేసే ఏ చట్టం అయిన అమలు పరచాల్సిందే. కేంద్రం ప్రకటించే ఏ పథకం అయినా కాశ్మీర్ ప్రజలు అర్హులే.
త్వరలో జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో త్రివర్ణపతాకం కాశ్మీర్ గడ్డపై సగర్వంగా రెపరెపలాడనుంది.