విద్యావనరుల సమావేశం
అచ్చంపేట విద్యావనరుల కేంద్రంలో అమ్రాబాద్,పదర మండలాలకు సంబందించిన ప్రధానోపాధ్యాయులతో ఎంఈవో శ్రీ బాలకిషన్ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో పాఠశాలకు సంబందించిన ప్యానల్ సమీక్ష,నిరంతర సమగ్ర మూల్యాంకనం రిజిస్టర్ మెయింటినెన్స్,గ్రామస్థాయి విద్యావిషయాలకు సంబందించి పూర్తిస్థాయిలో చేయాలనీ,పాఠశాలలో విద్యార్థుల స్థాయిని బట్టి విద్యా సమస్యలను రిజిస్టర్ చేయాలని,పాఠశాలస్థాయి బాలల సంఘాల పిల్లలను సాంకేతికంగా ఆధార్ తో అనుసంధానం చేయాలని,అదేవిదంగా పాఠశాలలో అన్ని రికార్డ్స్ సరియైన పద్దతిలో అమలు చేయాలని,నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని,మధ్యాహ్న భోజనంలో నాణ్యతతో పాటు వారానికి మూడు గుడ్లు విద్యార్థులకు అందేలా చూడాలని,మధ్యాహ్న భోజన బిల్లులు సకాలంలో ఇవ్వాలని మండల విద్యాదికారి బాలకిషన్ సూచించారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంలు సరళ,శంకర్,వెంకటయ్య,అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,పాఠశాల బాధ్యులు పాల్గొన్నారు.