యురేనియం తవ్వకాలను,అన్వేషణకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని వినతి
యురేనియం తవ్వకాలను,అన్వేషణకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలంటూ ప్రజా సంఘాల అధ్వర్యంలో అమ్రబాద్ మండల కేంద్రంలో శనివారం ధర్నా నిర్వహించారు.నల్లమలను పరిరక్షించుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిదని,ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ ధర్నా అనంతరం అమ్రబాద్ తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎస్. మల్లేష్,శ్రీనివాస్ రెడ్డి,బుచ్చి రెడ్డి,పి. గోపాల్,రాఘవులు తదితరులు పాల్గొన్నారు.