ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యావ్యవస్థ నీరుగారుతోంది:డిటిఎఫ్
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ విధ్యా వ్యవస్థ నీరుగారుతుందని డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు రామస్వామి అన్నారు.పట్టణంలో నిర్వహించిన ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతూ…ఏకీకృత సర్వీసులను అమలు చేయకపోవడంతో పదోన్నతులు లేకుండానే ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేస్తున్నారని ఆయన అన్నారు.ఉపాధ్యాయుల ధీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని,ప్రభుత్వ తప్పుడు విధానాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు.ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయకపోవడంతో విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.సమావేశంలో డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ నాయక్,సభ్యులు యాదగిరి రావు,మోతిరాం, నరసింహులు, వెంకటనారాయణ పాల్గొన్నారు.