ప్రభుత్వ,సంసృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ రాములు
నాగర్ కర్నూల్ ఎంపీ పొతూగంటి రాములు గారు బుదవారం పలు ప్రభుత్వ, సంసృతిక కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు.
జిల్లా కేంద్రంలోని తెరాస పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు.అనంతరం జిల్లాలోని తాడూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన విత్తన పంపిణి కార్యక్రమంలో పాల్గొని రైతులకు వేరుశనగ విత్తనాలను అందించారు.
అనంతరం కల్వకుర్తి ఎంపీడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మా ఉత్సవాల్లో తనయుడు పోతుగంటి భరత్ ప్రసాద్ తో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి,జడ్పీ చైర్మన్ పద్మావతి,మార్కెట్ కమిటీ చైర్మన్ ఈశ్వర్ రెడ్డి,వైస్ ఛైర్మన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.