పెద్దమ్మతల్లి బోన్నాలకు ముహూర్తం ఖరారు
అచ్చంపేటలోని పెద్దమ్మ తల్లి బోన్నాల పండుగకు యాదవ సంఘము తేదిని ఖరారు చేసింది.వచ్చే నెల18వ తేదీన పెద్దమ్మ బోన్నాల పండుగను జరపనున్నట్లు తెలియజేశారు. యాదవ సంఘము కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ పండుగ ఏర్పాట్లపై చర్చించారు.పండుగకు నిధులు సమకూర్చే విషయంపై చర్చ జరిగిన అనంతరం చందాలు సేకరిస్తామని,అలాగే పట్టణంలోని యాదవ కుటుంబాల నుండి ప్రతి గడపకు 300రూపాయలు వసూలు చేయనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.