పురుగుల ఆహారం తిని విద్యార్థినిల అస్వస్థత
◆పురుగుల ఆహారం తిని విద్యార్థినిల అస్వస్థత◆
అమ్రాబాద్ మండలం మన్ననూర్ లోని కస్తూరిబా బాలికల పాఠశాలలో పురుగుల ఆహారం తిని 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
గత రెండు రోజులుగా పురుగులతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వలన వాంతులు,విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు.
విద్యార్థినులను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు.
దీనిపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు, ఈ నిర్లక్ష్యానికి కారణమైన ప్రధానోపాధ్యాయునితో పాటు ఫుడ్ ఇన్చార్జి పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.