పీఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా లింగాల మండలవాసి పురుషోత్తం ఎన్నిక
వరంగల్ లో జరిగిన పీఆర్టియు టిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నందు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా లింగాల మండలం నుంచి పూజారి పురుషోత్తం ఎన్నికయ్యారు. ఈయన ఎన్నిక పట్ల లింగాల మండలం పీఆర్టియు టిఎస్ అధ్యక్షులు తాహేర్ భాషా,ప్రధాన కార్యదర్శి పూజారి సుదర్శన్,సీనియర్ నాయకులు అంజిలాల్,జిల్లా కార్యదర్శి రూప్లానాయక్, సీనియర్ నాయకులు గోపాల్ రాందాస్ లు హర్షం వ్యక్తం చేశారు.