పది పాసైతే చాలు.. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం.
కేవలం పదవతరగతి అర్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది పోస్టల్ డిపార్ట్‌మెంట్. ఇందుకోసం ఎలాంటి రాత పరీక్షలు ఉండవు. కేవలం టెన్త్‌లో సాధించిన మార్కుల ఆధారంగానే ఉద్యోగం ఇస్తారు. తెలంగాణలో 970 పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. బ్రాంచి పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచి పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఉద్యోగాలు ఉన్నాయి. అయితే మొదటి ప్రయత్నంలో పది పాసైన వారికే ప్రాధాన్యత ఇస్తారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ నవంబరు 14, 2019. వెబ్‌సైట్: www.appost.in.