నో నెట్వర్క్ నో సర్వీస్
BSNL నెట్వర్క్ కు మళ్లి అంతరాయం కలగడంతో ఆంధ్రాబ్యాంకు సేవలు నిలిచిపోయాయి.దానితో ఖాతాదారులు బ్యాంకు ముందు పడిగాపులు కాస్తున్నారు.బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వస్తే కానీ తిరిగి సేవలు ప్రారంభించలేమని బ్యాంకు సిబ్బంది చేతులెత్తేశారు.గడిచిన రెండురోజులు సెలవు దినం కావడం,ఇప్పుడు సేవలు నిలిచిపోవడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.
నెట్వర్కు తరచూ ఇబ్బంది పెడుతుండడంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసి సేవలు అందించాలని ఖాతాదారులు బ్యాంకు అధికారులను కోరుతున్నారు.