త్రాగు నీటి కోసం తిప్పలు
6వ వార్డు(పెద్దమ్మ గుడి)లో గత ఏడు రోజులుగా త్రాగు నీటి సరఫరా చేయకపోవడంతో కాలనీ వాసులు సుదూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. పబ్లిక్ ట్యాప్ కు నీటిని వదలక పోవడం, ఈ ప్రాంతంలో ఉన్న ఒక బోరు నురగలు కక్కుతుండడంతో తాగు నీటితో పాటు వాడుకోవడానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. రేపే పెద్దల పండుగ(పితృ అమావాస్య) కావడంతో ఏం చేయాలో అర్థము కావడం లేదంటూ, నీటిని సరఫరా చేసే సిబ్బందికి ఫోన్ చేస్తే సరిగా స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించి త్రాగు నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు.