తప్పిపోయిన బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు
లింగాల మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన బింకు రేణుక అడవికి వెళ్ళి తన తండ్రికి అన్నం ఇచ్చి తిరిగి వస్తుండగా దారి తప్పిపోయింది.తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం బట్టి ఆమె దగ్గర వున్న సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అచ్చంపేట డిఎస్పి నరసింహులు,సీఐ రామకృష్ణ,లింగాల ఎస్సై రమేష్ బృందం,ఫారెస్ట్ అధికారులు రాత్రి 12 గంటల సమయంలో అప్పాయిపల్లికి 12కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపమ్మగుడి,వానగుట్ట ఏరియాలో ఉన్నట్లు తెలిసింది.వెంటనే పోలీసులు,కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడకు చేరుకుని రేణుకను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కుటుంబీకులు,గ్రామస్తులు పోలీసులను అభినందించారు.