డెంగీ పరీక్షలు ఉచితం
ఇక అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగీ జ్వరం నిర్ధారణ పరీక్షలు,ఔషధాలు ఉచితంగా అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది.”ఇక్కడ డెంగీ నిర్ధారణ పరీక్షలు ఉచితం” అని పెద్దపెద్ద అక్షరాలతో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి సమాచారం సేకరించి రోజువారి వ్యాదుల నమోదు వివరాలను ఇ-బర్త్ పోర్టల్లో పొందుపరచాలని నిర్ణయించింది.క్షేత్రస్థాయిలో వైద్య పరీక్షల పై పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను నియమించింది.
జ్వర పీడితులు ఎక్కువసేపు వరుసలో నిలబడి లేరు కాబట్టి పేరు నమోదుకు గరిష్టంగా 20 నిమిషాలలో పూర్తయ్యే విధంగా ఆసుపత్రి బాధ్యులు చర్యలు తీసుకోవాలి.
రోగి పరిస్థితి విషమంగా ఉంటే తక్షణం హైదరాబాదులోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి తరలించడానికి ఆసుపత్రులలో తప్పనిసరి అంబులెన్స్ లను ఏర్పాటు చేసుకోవాలి.
డెంగీ దోమల నివారణకు పాఠశాలల్లో పగటిపూట కూడా ఫాగింగ్ చేయాలి.పారిశుద్ధ్యం, దోమల నియంత్రణ చర్యలను మున్సిపాలిటీలు రోజువారీగా సమీక్షించాలి.