చారకొండలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ,ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు పి.రాములు మరియు ఎమ్మెల్యే,విప్ గువ్వల బాలరాజు గారు మంగళవారం చారకొండ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.ముందుగా సిరసనగండ్ల శ్రీ సీతారామాలయంను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మండలంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీ,ఎమ్మెల్యే సంయుక్త అధ్వర్యంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
అనంతరం మండల తెరాస నాయకులతో,కార్యకర్తలతో సమావేశమై జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
అనంతరం వంగూరు మండల కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాలను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్,సర్పంచ్ విజయేంద్ర గౌడ్,ఎంపీపీ,ఎంపీటీసీ,మండల నాయకులు పాల్గొన్నారు.