కొండారెడ్డిపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో హరితహారం కార్యక్రమం
కొండారెడ్డిపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో 30రోజుల కార్యాచరణలో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ ప్రత్యేక అధికారి నాగలక్ష్మి,ఎంపీపీ బీమమ్మ హాజరయ్యారు.విద్యార్థులను ఉదేసించి గ్రామ ప్రత్యేక అధికారి నాగలక్ష్మి మాట్లాడుతూ…చెట్లు నాటడం మానవ మనుగడకు ఎంతో అవసరమని,చెట్లు లేనిదే మానవ మనుగడ సాధ్యం కాదని,చెట్లు నాటడం ప్రతి ఒక్కరి భాద్యత అని తెలిపారు.ప్రతి విద్యార్థి మొక్కలు నాటి దానిని సంరక్షించాలని సూచించారు.