ఉమామహేశ్వరంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే
కార్తీక సోమవారం సందర్బంగా శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో అచ్చంపేట ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు,ఆయన సతీమణి అమల గారు మరియు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు పి.రాములు గారి సతీమణి భాగ్యలక్ష్మి, ఆయన కుమారుడు భరత్ ప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఆలయ చైర్మన్ సుధాకర్ గారు వారికీ స్వాగతం పలికి ఆహ్వానించారు.
వేద పండితుల సమక్షంలో ఆ ఉమామహేశ్వరునికి రుద్రాభిషేకం మరియు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.