ఉపాధ్యాయ గర్జనను విజయవంతం చేయండి

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోరుతూ సెప్టెంబర్ 1న జాట్కో సంయుక్త కార్యాచరణ అధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించే ఉపాధ్యాయ గర్జనను విజయవంతం చేయాలనీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పర్వత్ రెడ్డి,ఎస్టియూ జిల్లా అధ్యక్షుడు మురళి పిలుపునిచ్చారు.
ఉపాధ్యాయ గర్జన వాల్ పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ…
గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని,43 శాతం ఐఆర్ ను ప్రకటించి 65 శాతం ఫిట్మెంట్ తో పిఆర్సి అమలు చేయాలని,ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుచేయాలని,సిపిఎస్ ను రద్దు చేసి ఓపిఎస్ ను అమలు చేయాలని,పాఠశాలల్లో వసతులు, పండిట్లు, పీఈటీల ను అప్గ్రేడ్ చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయ గర్జన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అన్ని సంఘాలకు చెందిన ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ గర్జనను జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు.