సీఎం దిష్టిబొమ్మ దహనం
అచ్చంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 29వ రోజుకు చేరుకోవడంతో మద్దతుగా భారతీయ విద్యార్థి సేన,ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల అధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో మానవహారం నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను ఆర్టీసీ కార్మికులు దహనం చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…ఆర్టీసీ కార్మికులు గత కొంత కాలంగా సమ్మె చేస్తున్న…ఈ విషయం పై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష ధోరణి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.