శ్రీశ్రీశ్రీ గెల్వలాంబ మాత బ్రహ్మోత్సవాలు

0

వంగూర్ మండలంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన శ్రీశ్రీశ్రీ గెల్వలాంబ మాత బ్రహ్మోత్సవాలకు దేవస్థాన కమిటి కార్యవర్గ సభ్యులు తేదీలు ఖరారు చేశారు.శ్రావణ బహుళ పంచమి నుండి సప్తమి వరకు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
మండల పరిధిలో ఈ దేవాలయానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది, కేవలం ఆ గ్రామం మాత్రమే కాక చుట్టు పక్కల గ్రామాల నుండి, కల్వకుర్తి,చారగోంఢ మండలాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.

ఇక తేదీల వారిగా చూస్తే…….
20-8-2019 మంగళవారం రోజు నజర్ బోనాలు, వైశ్యుల బోనాలు, బండ్లు తిరుగును.

21-8-2019 బుదవారం రోజు పద్మశాలి,గౌడ్,రెడ్డిస్,బోయ,యాదవుల బోనాలు,ఇతర గ్రామస్తుల బండ్లు తిరుగును.

22-8-2019 గురువారం రోజు తెలుగువారి బోనాలు,బండ్లు తిరుగును.

23-8-2019 శుక్రవారం రోజు తెల్లవారుజాము 4 గంటలకు రథోత్సవం,రాత్రికి శ్రీ క్రిష్ణ జననం డోలారోహణము.

24-8-2019 శనివారం రోజు యాదవులచే ఉట్లు కొట్టించే కార్యక్రమము.

కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవి కృపకు పాత్రులు కాగలరని మనవి చేశారు.
ఇతర వివరాలకు 9505380673 నంబరుకు సంప్రదించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *