శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు ఎత్తివేత
తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం అధికం అవ్వడంతో డ్యామ్ నిండు కుండలా తొనికిసలాడింది.
దాంతో జలాశయం పది గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెట్టింది.
శ్రీశైలానికి వచ్చిన యాత్రికులు జలాశయం వద్ద సుందర దృశ్యాన్ని చూస్తూ ఆస్వాదించారు.