వేడుకగా ఎం.ఎల్.ఏ గువ్వల బాలరాజు గారి జన్మదినోత్సవం
అచ్చంపేట శాసన సభ్యుడు శ్రీ గువ్వల బాలరాజు గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు అచ్చంపేట తెరాస పార్టీ కార్యాలయానికి చేరి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి మధ్యనే ఆయన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన మహా రక్తదాన శిభిరంలో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నాగర్కర్నూల్, రక్తనిధి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మహబూబ్ నగర్ మరియు బ్లడ్ బ్యాంక్ ఏరియా హాస్పిటల్ వనపర్తి వారి అధ్వర్యంలో మధ్యాహ్నం వరకు 104 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
ఈ ఏర్పాట్లను అచ్చంపేట నగర పంచాయతి చైర్మన్ కె. తులసిరామ్ గారు మరియు రాజేందర్ గారు దగ్గరుండి పర్యవేక్షించారు. రక్తదానం చేసిన కార్యకర్తలకు ప్రశంస పత్రం అందజేశారు.
ఉదయం ఎం.ఎల్.ఏ గువ్వల బాలరాజు గారు సి.ఎం.కెసిఆర్ గారిని కలిసి ఆయన ఆశీర్వాదం స్వీకరించిన అనంతరం అచ్చంపేట లోని పార్టీ కార్యాలయం చేరి కార్యకర్తలతో గడిపారు. వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో తెరాస పార్టీ కార్యకర్తలు ,అభిమానులు వేల సంఖ్యలో పాల్గొన్నారు.