వెల్టూరు గ్రామంలో పారిశుధ్య చర్యలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా వెల్టూరు గ్రామంలో రోడ్ల వెంబడి, మురికి కాల్వల వెంబడి, మినీ ట్యాంక్ బండ్, గ్రామానికి సరఫరా చేసే ట్యాంక్ ల వెంబడి బ్లీచింగ్ పౌడర్ చల్లి దోమలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవడానికి,ఆరోగ్యంగా ఉండటానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు స్పెషలాఫీసర్ సింగోటం తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మధుమోహన్,ఎంపీటీసీ రంగారెడ్డి,ఫీల్డ్ అసిస్టెంట్ దేవేందర్,ఆశా వర్కర్లు శ్రీమతమ్మ,పద్మ,కో-ఆప్షన్ సభ్యుడు బాలరాజు, వార్డ్ నెంబర్లు పలువురు పాల్గొన్నారు.