విద్యుత్ స్తంభం ప్రమాదకర స్థితిలో

ఉప్పునుంతల మండల కేంద్రంలోని జుమ్మా మసీదు దగ్గర గల విద్యుత్ స్తంభం ప్రమాదకర స్థితిలో ఒక పక్కకు ఒరిగి ఉన్నది. ఆ కాలనీవాసులు అటుగా వెళ్ళే రైతులు అది ఎప్పుడు ఎవరి పైన ఎవరికీ పడుతుందో అన్న భయంతో బిక్కుబిక్కు మంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అటు నుండి ప్రయాణిస్తున్నారని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా అయినా అధికారులు స్పందించి బాగుచేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.