విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి
అచ్చంపేట మండలం అప్పాయిపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి కాడి ఎద్దు మృతి చెందినది.గ్రామానికి చెందిన రైతు చంద్రయ్యకు చెందిన ఎద్దు మేత మేస్తూ ప్రమాదవశాతు ట్రాన్స్ఫార్మర్ తీగలకు తగలడంతో విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందినది. ట్రాన్స్ఫార్మర్ కి సరియైన కంచె లేనందున ఈ ప్రమాదం జరిగిందని కావున నష్టపరిహారం చెలించి రైతుకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.