విజయవంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ బంద్
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా నేడు చేపట్టిన బంద్ విజయవంతంగా కొనసాగుతుంది.
ఆర్టీసీ జెఎసి నాయకులు రాష్ట్ర వ్యాప్త బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో నేడు బంద్ పాటిస్తున్నారు.
పట్టణంలోని వ్యాపార సంఘాలు,కార్మిక సంఘాలు కూడా బంద్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో వస్త్ర దుకాణాలు, కిరాణా, అన్ని దుకాణాలు ఉదయం నుండే తెరుచుకోలేదు. అక్కడక్కడ కొన్ని తెరుచుకున్నా ఆర్టీసీ సంఘాల నాయకులు దుకాణాలు మూప్పించారు.
అలాగే ప్రైవేట్ వాహనాలను కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు.
ఇక సమ్మె చేస్తున్న ప్రాంగణంలో సిపిఎం కళాకారులు ఆట పాటలతో ధూమ్-ధామ్ కార్యక్రమం నిర్వహించారు.
పోలీసులు, అధికారులు సమ్మె ప్రాంగణంలో భారీగా మోహరించారు.