రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
యువకులు మద్యం సేవించిన కారు నడపడంతో అదుపు తప్పి ముగ్గురు స్త్రీలకు తీవ్రగాయాలయ్యాయి.
అయ్యవారి పల్లి గేట్ సమీపంలో బస్టాప్ వద్ద బస్సు కోసం ఎదురు చూస్తున్న ముగ్గురు స్త్రీలను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఈ గాయాలయ్యాయి.గాయపడిన వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.
ప్రమాదానికి కారణమైన కారును, యువకులను అదుపులోకి తీసుకొని అచ్చంపేట పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం.