యోగ సాధనతో విద్యార్థులలో చురుకుదనం పెరుగుతుంది.

అచ్చంపేట: యోగ సాధనతో విద్యార్థులలో చురుకుదనం పెరుగుతుందని మాతృభూమి స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు రమాకాంత్ అన్నారు. స్థానిక శ్రీచైతన్య ఉన్నత పాఠశాలలో VHP అద్వర్యం లో నిర్వహించిన ఉచిత సంష్కార శిక్షణ శిభిరం లో మాట్లాడుతూ వివిధ అంశాలలో నిపుణులతో శిక్షణను ఇప్పిస్తున్నామని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు శిభిరం లో శిక్షణ ఇస్తున్నామని ఈ సదుపాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.