యాసంగి లక్ష్యంలో 85% సాగు

0
achampeta news

మందకొడిగా మొదలైన యాసంగి పంటల సాగు.. ముఖ్యంగా వరిసాగు ఊపందుకున్నది. యాసంగి సాధారణసాగు 13.38 లక్షల హెక్టార్లుగా వ్యవసాయశాఖ నిర్ణయించింది. మార్చి రెండోవారం వరకు మొత్తం పంటల సాగు 11.37 లక్షల హెక్టార్లుగా నమోదై 85 శాతానికి చేరుకొన్నది. గత ఏడాది సాధారణ పంటల సాగు 12.56 లక్షల హెక్టార్లుగా నిర్ణయించగా.. 11.46 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి. ప్రస్తుత సీజన్‌లో వరి సాగు సాధారణ విస్తీర్ణం 7.05 లక్షల హెక్టార్లు కాగా.. ఇప్పటివరకు 6.77 లక్షల హెక్టార్లలో సాగైంది. గతేడాది సాధారణ సాగు లక్ష్యం 7.41 లక్షల హెక్టార్లుగా నిర్ణయించగా.. 6.77 లక్షల హెక్టార్లలో వరిసాగు జరిగింది.

మక్కజొన్న 1.66 లక్షల హెక్టార్ల సాధారణ సాగు లక్ష్యంగా నిర్ణయించగా 1.16 లక్షల హెక్టార్లలో, గోధుమ సాధారణ సాగు లక్ష్యం 0.07 లక్షల హెక్టార్లకు 0.03 లక్షల హెక్టార్లు , జొన్న 0.33 లక్షల హెక్టార్లకు 0.03 లక్షల హెక్టార్లు, సజ్జలు 0.09 లక్షల హెక్టార్లకు 0.04 లక్షల హెక్టార్లు, రాగి 0.01 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు నమోదైంది. పప్పుధాన్యాల సాగు 103 శాతంగా నమోదైంది. పెసర్లు 0.08 లక్షల హెక్టార్లు, మినుములు 0.05 శాతం, కందులు 0.01 లక్షల హెక్టార్లు, పల్లి 1.10 లక్షల హెక్టార్లు, ఇతర పప్పుధాన్యాలు 0.04 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి. నూనెగింజల సాగులో పల్లి సాధారణ సాగు విస్తీర్ణం 1.43 లక్షల హెక్టార్లు లక్ష్యం కాగా.. 1.11 లక్షల హెక్టార్లలో, కుసుమలు 0.08 లక్షల హెక్టార్లు, పొద్దుతిరుగుడు 0.02 లక్షల హెక్టార్లలో, ఇతర నూనెగిం జల పంటలు 0.04 లక్షల హెక్టార్లలో సాగైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *