మాల కులస్థుల బోనాల మహోత్సవం
గత మూడు రోజులుగా అచ్చంపేట పట్టణంలో పండుగ శోభా నెలకొంది.మొన్న యాదవుల,నిన్న మాదిగ కులస్తుల,నేడు మాల కులస్తుల బోనాలు నిర్వహించారు.
మంగళవారం మాల కులస్థుల బోనాలు వైభవంగా జరిగాయి. మహిళలు భక్తీ శ్రద్ధలతో బోనం ఎత్తి చెన్నకేశవస్వామి ఆలయం వద్ద పూజలు నిర్వహించి, వారి కుల దేవత పోచమ్మ ఆలయానికి చేరారు.కుటుంభ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని,బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. యువకులు డిజే డాన్సులతో హోరేతించగా, యువతులు కోలాటాలతో మైమరిపించారు.
ఎంఎల్ఏ గువ్వల బాలరాజు గారి సతీమణి అమల గారు ముఖ్య అతిథిగా పాల్గొని, యువతులతో కలిసి కోలాటం ఆడారు.