మండల ప్రజా పరిషత్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం
◆మండల ప్రజా పరిషత్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం◆
అచ్చంపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం జరిగాయి.ఈ ప్రమాణ స్వీకారా నికి అధ్యక్షతగా ఎంపీడిఓ సురేష్ గారు వ్యవహరించారు. ఆయన రంగాపూర్ ఎంపీటీసీ గా ఎన్నికైన శాంతభాయిచే యం.పి.పి గా ప్రమాణ స్వీకారం చేయించారు, అనంతరం కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేసి, భాద్యతలు స్వీకరించారు.
ఈ స్వీకారానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎం.యల్.ఏ బాలరాజు గారు హాజరై నూతన పాలక మండలిని అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
అచ్చంపేట మండల స్థానిక సంస్థల ఎన్నికలలో పోటిచేసిన తెరాస అభ్యర్థులు అన్ని ఎంపీటీసీ స్థానాలలో విజయం సాధించారని, ప్రజలు మా మీద ,మా పార్టీ నాయకుడు కెసిఆర్ మీద సంపూర్ణ విశ్వాసం తెలియజేశారని,మా మీద ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు తెలియజేశారు.
బడుగు, బలహీన వర్గాల నుండి వచ్చిన మమ్మల్ని ఎంతో ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారని, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజా సేవకే అంకితం అవుతానని తెలియజేశారు.
మన ప్రాంతం బాగుపడాలంటే ఎంపీటీసీల నుండీ జడ్పీ చైర్మన్ వరకు క్షేత్ర స్థాయిలో, గ్రామాలలో మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో,పనులలో దృష్టి కేంద్రీకరించి, ప్రజల అవసరాలు తీర్చే విధంగా నిబద్ధతతో పని చేయాలని కొత్త ఎంపీటీసీలకు సూచించారు.
ఏ విషయంలోనైన,ఎక్కడైన అధికారులు విస్మరించినట్లుగా కనిపిస్తే అక్కడ కావలిదారులుగా ఉండి పనులు అయ్యేదాకా పోరాడతామని తెలియజేశారు. ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని ,నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతగా ఉంటూ ప్రజల అవసరాన్ని తీరుస్తూ, ప్రజల కోసమే అంకిత భావంతో పనిచేయాలని, ఈ ప్రాంతం బాగు పడే విధంగా మనమందరం ఐక్యతను చాటావలసిన సందర్భం ఇదని, మనమంతా కలసి ప్రజా సమస్యలపై పోరాడదామని పిలుపునిచ్చారు.
ఎంపీటీసీల,జడ్పీటిసిల పరిధిలోని అంశాలు,సమస్యలను నా దృష్టికి తెచ్చినట్లయితే చిత్తశుద్ధితో,అంకిత భావంతో మనమంతా ఒక్కటే అన్నే భావనతో నా సహకారం అందజేస్తానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులుగా యం.పి.డి.ఓ సురేష్ గారు వ్యవహరించగా, అతిధులుగా జిల్లా రైతు సమన్వయకర్త పోకల మనోహర్ గారు,అచ్చంపేట నగర పంచాయతి చైర్మన్ తులసిరామ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్ గారు, అచ్చంపేట తహసిల్దార్ చెన్న కిష్టయ్య గారు, తెరాస నాయకులు, కార్యకర్తలు,వివిధ గ్రామాల ప్రజలు తరలివచ్చారు.