బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం
జిల్లా కలెక్టర్ శ్రీధర్
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధమని,అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అధికారులను నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు.జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో యాంటి టొబాకో సెల్ జిల్లా ఉన్నత స్థాయి కమిటీ మొదటి సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఓటిపి 2003 కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాలలో ధూమపానాన్ని నిషేధించారని, ఈ చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలుపరిచే బాధ్యత పోలీసులు,వైద్యశాఖతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులపై ఉందన్నారు.బహిరంగ ప్రదేశాలలో పొగతాగే వారి పై కేసు నమోదు చేసే అధికారం పోలీసులకు ఉందని ఆయన తెలిపారు.