బతుకమ్మ సంబరాలు

అచ్చంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.
రేపటి నుండి కళాశాలకు సెలవులు కావడంతో శుక్రవారం కళాశాల ప్రాంగణంలో ఉత్సవాలు నిర్వహించారు.విద్యార్థినీలు సాంప్రదాయ వస్త్ర ధారణ ధరించి బతుకమ్మను పేర్చి డిజే పాటల మధ్య ఆడారు.
విద్యార్థులను తెలంగాణ సంప్రదాయంలో భాగస్వాములను చేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.