ప్రసిద్ధి గాంచిన సాహసం తో కూడిన ప్రయాణం మన సలేశ్వర లింగమయ్య క్షేత్రం
శ్రీశైలానికి 40 కిమేమిటర్ల దూరం లో ఉంటుంది అడవిలోనుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. ఇక్కడకి దాదాపు వాహనాలు 20 కిలోమీటర్లు కార్లు, జీపులు, బస్సులు, బైకులు వెళతాయి కానీ మొత్తం రాళ్ళోతో కూడుకున్నటువంటి ఘాటురోడ్డు మరియు పక్క అడవిరోడ్డు.
సలేశ్వరం లో శివుడు లింగం రూపం లో ఉంటాడు ఈ సలేశ్వర దేవస్థానం ప్రతి సంవత్సరం కేవలం 4 రోజులు మాత్రం తెరిచి ఉంటుంది.
సలేశ్వరం శ్రీశైలం దగ్గరలోని ఒక యత్రా స్థలము. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యాత్రా స్థలము. ఇక్కడ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తొలి పౌర్ణమికి మొదలగుతుంది.
కేవలం ఐదు రోజులు మాత్రమే ఈ గుడి తెరిచివుంటుంది.. ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి.
ఎక్కడ ఉన్నది ?
ఇది తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో నల్లమల అడవులలో వుంది. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే రహదారిలొ 150 కిలోమీటర్ రాయి నుండి 32 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో వుంది.
ప్రకృతి అందాలతో పాటు ఎంతో చారిత్రాత్య్మక నేపథ్యం కలిగిన సలేశ్వర క్షేత్రం
ప్రకృతిరమణీయతతో అలరారుతున్న దట్టమైన గుడి, ఎత్తైన కొండలు పాలనురుగులా జాలువారే జలపాతం,ప్రకృతి అందాలతో పాటు ఎంతో చారిత్రాత్య్మక నేపథ్యం కలిగిన సలేశ్వర క్షేత్రం. ఈ క్షేత్రవిశేషాలేంటో ఇప్పుడు చూద్దాం