ప్రభుత్వ విప్ గా బాధ్యతలు చేపట్టిన గువ్వల బాలరాజ్
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక చాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజు, ఆయన సతీమణి అమల చాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించిన గువ్వల బాలరాజుకు మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,పార్లమెంటు సభ్యులు పి.రాములు,ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి,మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూలు జడ్పీ చైర్మన్ పద్మావతి, వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ లు శుభాకాంక్షలు తెలియజేశారు.
అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గం లోని అచ్చంపేట, బల్మూర్, లింగాల, ఉప్పునుంతల, వంగూరు, అమ్రాబాద్, చారగొండ మండలాల నుంచి తెరాస శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రభుత్వ విప్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ… తనకు విప్ గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు.తనను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన అచ్చంపేట నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తానని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే సీఎం కేసీఆర్ తనకు ప్రభుత్వ విప్ గా అదనపు బాధ్యతలు ఇచ్చారని,అభివృద్ధె లక్ష్యంగా పని చేస్తానని భరోసా ఇచ్చారు.