ప్రణాళికలతో గ్రామాలు అభివృద్ధి
ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళికలతో ముందుకు వెళ్తే గ్రామాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతాయని ఎంపీడీవో చెన్నమ్మ అన్నారు.మండలంలోని బ్రాహ్మణపల్లిలో సర్పంచ్ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ…ప్రణాళికలు పకడ్బందీగా అమలు చేస్తే పరిసరాలు శుభ్రంగా ఉంటాయని అన్నారు.
అదేవిధంగా మండలంలోని చందాపూర్ లో తాసిల్దార్ చెన్న కిష్టన్న గ్రామ సభలో పాల్గొన్నారు.ఆయా గ్రామాల్లో గ్రామ సర్పంచులు గ్రామ సభల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్ రెడ్డి, ఆర్ఐ ఈశ్వర్, విఆర్వోలు శ్రీనివాస్, రంగన్న, రామకృష్ణ, ఆంజనేయులు పాల్గొన్నారు