నల్లమల్లలోని గ్రామాలలో అలజడి
◆నల్లమల్లలోని గ్రామాలలో అలజడి◆
నల్లమలలోని అమ్రాబాద్ మండలంలో ఏ గ్రామంలో చూసినా ఒకటే విషయం పై చర్చ జరుగుతుంది.
త్వరలో గ్రామాలు ఖాళీ అవుతున్నాయి అనే వార్త దావానంలా వ్యాపించడంతో ఎక్కడ నలుగురు కూడిన ఇదే విషయంపై చర్చ జరుగుతుంది.
యురేనియం తవ్వకాల కోసం అమ్రాబాద్ మండలంను రిజర్వ్ ప్రాంతంగా గుర్తించినట్లు ప్రాథమిక సమాచారం అందడంతో చర్చ జోరుగా కొనసాగుతోంది.
అధికారులు గ్రామాల వారీగా రాజకీయ నాయకులు గ్రామ పెద్దలతో చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం తెలుస్తుంది.
తిర్మలాపూర్ గ్రామానికి కేంద్రంగా చేసుకుని ఎటు చూసినా 80 కిలోమీటర్ల పరిధిలో తవ్వకాలు చేయనున్నట్లు ప్రాథమిక సమాచారం ఉండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
ఈ పరిధిలోని గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల నగదుతో పాటు వ్యవసాయ భూమి ఉన్నవారికి మరి కొంత నగదు నష్టపరిహారం ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉంది.
దేశ క్షేమం కోసం త్యాగాలు తప్పవని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.ఏది ఏమైనా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.