తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో బతుకమ్మ సంబరాలు
పట్టణంలోని మారుతీ నగర్ కాలనీలో తెలంగాణ జాగృతి విద్యార్ధి విభాగం కన్వీనర్ డి. గణేష్ అధ్వర్యంలో బతుకమ్మ సంబరాల వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. సత్యసాయి బాబా గుడి ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద మహిళలు ఆట, పాటలతో బతుకమ్మ ఆడుతూ,కోలాటాలతో వేడుకలు నిర్న్వహించుకున్నారు.
ఈ వేడుకలకు తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ మిర్యాల పావని,మహిళ విభాగం సి.మంజుల,రామ కృష్ణ, సత్యం,సాయి జ్యోతి,భారతి తదితరులు పాల్గొన్నారు.