తెరాస వార్డు కమిటీ సభ్యుల ఎన్నిక
అచ్చంపేట పట్టణంలోని 6వ వార్డు, 13వ వార్డులో తెరాస వార్డు కమిటీ సభ్యుల నియామకం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ కె.తులసి రామ్ గారు మరియు తెరాస పట్టణ కార్యదర్శి నరసింహ గౌడ్ గారు పాల్గొన్నారు.
6వ వార్డు కమిటీ అధ్యక్షులుగా గడ్డం రమేష్ యాదవ్, ఉపాధ్యక్షులుగా బాత్క తిరుపతయ్య యాదవ్ మరియు బద్ధుల శ్రీను యాదవ్, ప్రధాన కార్యదర్శిగా శీలం రవి, కార్యదర్శులుగా ఎం. మల్లేష్ మరియు టి. మల్లయ్య ఎన్నికయ్యారు.
13వ వార్డు కమిటీ అధ్యక్షులుగా తొంబర్ల శ్రీను, ఉపాధ్యక్షులుగా బద్దుల రాములు మరియు గడ్డం శేఖర్, ప్రధాన కార్యదర్శిగా గడ్డం కృష్ణ, కార్యదర్శిగా వారుగంటి రాజు మందుల అంతయ్య ఎన్నికయ్యారు.
13వ వార్డు యూత్ కమిటీ అధ్యక్షులుగా ఎం.రాకేశ్ వర్మ, ఉపాధ్యక్షులుగా కే.శివ మరియు ఎం.మహేష్, ప్రధాన కార్యదర్శిగా పి.అంజి, కార్యదర్శిగా పి.రమేష్ మరియు జి.అజయ్ లు ఎన్నికయ్యారు.
is
ఎన్నికైన సభ్యులకు చైర్మన్ కె.తులసిరామ్ గారు నియామక పత్రాలు అందజేసి సన్మానించారు.తులసి రామ్ గారు మాట్లాడుతూ… ఎన్నికైన సభ్యులు వార్డు అభివృద్ధిలో, ప్రజాసమస్యల పరిష్కారంలో, పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు గడ్డం పర్వతాలు,బెల్లి బాలరాజు,తెరాస కార్యకర్తలు రమేశ్,శ్రీను,రాములు,ఆంజనేయులు,రవి,మల్లేష్,శేఖర్,రాజు పాల్గొన్నారు.